కరోనా సోకినా ఎవరూ భయపడొద్దు – సీపీ మహేష్

Tuesday, July 7th, 2020, 01:41:59 AM IST


తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ఈ నేపధ్యంలో సీపీ మహేష్ భగవత్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ సోకినా ఎవరూ కూడా భయపడ వద్దు అని అన్నారు. ఇందుకోసం సరైన ఆహారం మరియు జాగ్రత్త చర్యలు పాటిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు అని వ్యాఖ్యానించారు. అయితే కమిషనరే ట్ పరిదిలో ఇప్పటి వరకూ 53 మందికి కరోనా సొకగా అందులో ఎనిమిది మంది కరోనా వైరస్ ను జయించారు అని వ్యాఖ్యానించారు.

అంతేకాక మిగతా సిబ్బంది కోలుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపధ్యం లో ప్రత్యేకంగా డ్రైవ్ లు నిర్వహిస్తున్నాం అని అన్నారు. విధిగా మాస్క్ లు ధరించాలి అని, లేని వారికి ఫైన్ లు విదిస్తున్నాం అని వ్యాఖ్యానించారు. ఎక్కడైనా ఎక్కువగా ప్రజలు గుమి గూడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, వేడుకలు జరుపుతున్నా వెంటనే సమాచారం ఇవ్వాలి అని ప్రజలను కోరారు. రాష్ట్రం లో ఇప్పటికే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యం లో సీపీ మహేష్ చేసిన వ్యాఖ్యలు కొంత దైర్యం ను ఇస్తున్నాయి.