రుయాలో మృతుల సంఖ్య 11 కాదు 23 – సీపీఐ నారాయణ

Wednesday, May 12th, 2021, 03:21:46 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రుయా ఆసుపత్రి లో ఆక్సిజన్ అందక 11 మందే చనిపోయారు అంటూ ప్రభుత్వం అసత్యం చెబుతోంది అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఘటన లో మొత్తం 23 మంది చనిపోయారు అని పేర్లను ప్రకటించారు నారాయణ. అయితే మృతుల్లో కే. బాలు, జయచంద్ర, రామారావు, రమేష్ బాబు, భువనేశ్వరి బాబు, కలందర్, రమణాచారి, ప్రభాకర్, మహేంద్ర, షాహిద్, గజేంద్ర బాబు, పుష్పలత, మహ్మద్ పాష, వేణుగోపాల్, గౌడ్ బాషా, రాజమ్మ, మదన్మోహన్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, సుబ్రహ్మన్యం, సులోచన, తనుజరాణి, పజులాల్, వెంకట సుబ్బయ్య ఉన్నట్లు తెలిపారు. అయితే ఆక్సిజన్ విషయం లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేక పోతుంది అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాక రుయా లో మృతుల సంఖ్య పై ప్రభుత్వం వాస్తవాలను చెప్పడం లేదని అన్నారు.

అయితే ఆక్సిజన్ ట్యాంకర్ లను రెండు రోజుల ముందు తెప్పించుకొని నిల్వ పెట్టుకోరా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఆక్సిజన్ ఇవ్వాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటూ నిలదీశారు. అంతేకాక వాక్సిన్ కంపనీ లకి కులాలను ఆపాడిస్తారా అంటూ మండిపడ్డారు. అయితే విచారణ కమిటీ వ్యర్దం, ప్రభుత్వం ఏం చెబితే అదే రాస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే నారాయణా చేసిన వ్యాఖ్యలు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి.