జగన్ ఏడాది పాలన పై సీపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు!

Sunday, May 24th, 2020, 04:54:59 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలన పై అపుడే ప్రజల్లో ఆసక్తి మొదలైంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనా విధానం పై ప్రతి పక్ష పార్టీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ మేరకు సీపీ ఐ నేత నారాయణ జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఏడాది పాలన రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ మాదిరిగా జగన్ పాలన కొనసాగింది అని అన్నారు.అంతేకాక గత ప్రభుత్వాలు అయిన చంద్రబాబు నాయుడు మరియు వై యస్ ఆర్ పాలనలో వారు చేసిన దానిలో పది శాతం కూడా జగన్ చేయడం లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులను తొక్కేయ డానికి కసిగా పని చేస్తున్నారు అని అన్నారు.

జగన్ పాలన ప్రజా వేదికను కూల్చడం ద్వారా తన మార్క్ పాలన కు తెర తీశాడు అని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ను మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు అని అన్నారు.అయితే జగన్ తీరు తో ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా ను మరిచి పోవాల్సిందే అని అన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల పై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ అంశం పై జాతీయ స్థాయిలో లో జగన్ చులకన అయ్యారు అని అన్నారు. ప్రతి పక్ష నాయకుడు గా ఉన్నప డు అమరావతికి మద్దతు తెలిపారు అని నారాయణ గుర్తు చేశారు. అంతేకాక వైసీపీ కి ఓటు వేసిన వారే ఇపుడు జగన్ పాలన పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు.