ముఖ్యమంత్రి ఫాం హౌస్ లో పడుకున్నారు – సీపీఐ నారాయణ!

Saturday, July 11th, 2020, 03:01:24 AM IST


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతలు వరుస విమర్శలు చేస్తుండగా, ఇపుడు సీపీఐ నారాయణ సచివాలయం కూల్చివేత పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ శకం నుండే హైదరాబాద్ నిర్మాణం అయినట్లు చూపిస్తున్నారు అని, గతం లో నిజాం నవాబ్ మరియు పదిమంది ముఖ్యమంత్రులు పాలించినట్లు చెప్పకుండా, తానే నిర్మించినట్లు చూపించాలనే ఉద్దేశ్యం తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు.

అయితే రాష్ట్రం లో కొత్త సచివాలయం కి ఎలాంటి అభ్యంతరం చెప్పను అంటూనే, కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి అని, అలా కరోనా తో బాధపడుతున్న వారిని కాపాడాల్సింది పోయి,సచివాలయం పడగొట్టడం అంటే మానవత్వ వ్యతిరేక చర్య అని, దీన్ని ఖండిస్తున్నాం అని, ఇది సరైన సమయం కాదు అను వ్యాఖ్యానించారు. అంతేకాక సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పడుకున్నారు అని, ప్రజలంతా కేసీఆర్ కి కరోనా వచ్చింది అని ఆందోళన చెందుతున్నారు కానీ, తాను అలా అనుకోవడం లేదు అని అన్నారు.

అయితే సీఎం కేసీఆర్ తెలివైన వారు అని, ఆయన ప్రజలందరికీ కరోనా తెప్పిస్తారు కానీ, ఆయన తెచ్చుకొరు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి దీని పై తెరాస నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.