BJP నేత కన్నాపై CPI రామకృష్ణ కౌంటర్ – అద్దిరిపోయిందిగా…?

Tuesday, November 12th, 2019, 02:40:12 AM IST

రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్నాక సీఎం జగన్ ఎన్నో కీలకమైన నిర్ణయాలని తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం లో నడిపించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. కాగా తాజాగా సీఎం జగన్ మరొక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం ని తీసేసి ఇంగ్లిష్ మీడియం ని ప్రవేశపెడుతూ సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ విషయంలో విపక్షాలు అన్ని కూడా సీఎం జగన్ పై మండిపడుతున్నాయి. కాగా ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కూడా సీఎం జగన్ ని విమర్శించారు. అయితే కన్నా చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శలు చేశారు.

రాష్ట్రంలో ఇంగ్లీషు మీడియం చదువులు మతమార్పిళ్లను ప్రోత్సహిస్తాయని, కన్నా తెలపగా, వాటిని ఖండిస్తూ కన్నా చేసిన వాఖ్యలు సరికాదని ఆరోపించారు. అంతేకాకుండా ఇంగ్లీషు మీడియం మతమార్పిళ్లను ప్రోత్సహించేదే అయితే మీ పిల్లల్నెందుకు ఇంగ్లీషు మీడియంలో చదివించారని కన్నాను ప్రశ్నించారు. ఈమేరకు మాట్లాడిన సిపిఐ నేత సీఎం జగన్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా విపక్ష నేతలపై ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని సూచించారు.