ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ తో చేతులు కలుపుతాం

Tuesday, January 31st, 2017, 02:00:17 AM IST

Cpi-Narayana
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాదించేందుకు, అభివృద్ధిలో అట్టడుగున ఉన్న వర్గాల వాటాను రప్పించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చేతులు కలుపుతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ చెప్పారు. ఎస్సీ. ఎస్టీ, బీసీ, మైనారిటీల హక్కుల సాధనకు చేపట్టిన సామజిక న్యాయ శంఖారావ ప్రజా చైతన్య యాత్ర ఆదివారం రాత్రి విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నం కు చేరింది.

ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. విశాఖ పట్టణంలో చంద్రబాబు నాయుడు నిర్వహించిన భాగస్వామ్య సదస్సు ప్రచార ఆర్భాటానికే తప్ప రాష్ట్రానికి ఉపయోగపడింది ఏం లేదని ఆయన విమర్శించారు. గతంలో 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పుకుంటున్నారని, కానీ నిజానికి 10 వేల కోట్లకు మించి పెట్టుబడులు రాలేదని రామకృష్ణ స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలనీ రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని, అంతేకాకుండా ఉత్తరాంధ్ర కు బుందేల్ ఖండ్ తరహాలో ప్యాకేజీ కల్పించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.