నితిన్‌కి అంత‌ర్జాతీయ గాయ‌కుడు ప్ర‌మోష‌న్‌ ?

Thursday, March 15th, 2018, 10:03:21 PM IST

నితిన్ `ఛ‌ల్ మోహ‌న్‌రంగ‌` రిలీజ్‌కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. త్రివిక్ర‌మ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ స్పీడందుకున్న సంగ‌తి తెలిసిందే. అందుకు త‌గ్గ‌ట్టే జోరుగా ప్ర‌మోష‌న్ సాగుతోంది. లేటెస్టుగా ఈ సినిమాకి అంత‌ర్జాతీయ గాయ‌కుడు ఆకోన్ ప్ర‌మోష‌న్ చేయ‌డం అటు బిజినెస్ వ‌ర్గాల్లో, ఇటు ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో ఆస‌క్తి రేకెత్తిస్తోంది. అంతేకాదు.. విదేశాల్లో ఓచోట ప్రివ్యూలో నితిన్ డ్యాన్సులు చేస్తున్న వీడియోని ఆకోన్ కోసం లైవ్ చేశారు.

ఈ డ్యాన్సులు వీక్షించిన గ్రేట్ సింగ‌ర్ నితిన్ డ్యాన్సుల‌కు ఫిదా అయిపోయాడు. నిఖిల్ సినిమాకి తాను ప్ర‌చారం చేస్తాన‌ని అన్నాడు. ఆ క్ర‌మంలోనే నిఖిల్ సంతోషం వ్య‌క్తం చేస్తూ ట్విట్ట‌ర్లో ఆ వీడియోని పోస్ట్ చేసి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశాడు. “నా ఆల్ టైమ్ ఫేవ‌రెట్, లెజెండ‌రీ సింగ‌ర్ ఆకోన్ నా సాంగ్ వీక్షించి టీమ్‌కి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆకోన్‌కి కృత‌జ్ఞ‌త‌లు“ అంటూ సంతోషం వ్య‌క్తం చేశాడు. ఛ‌ల్ మోహ‌న్ రంగ విదేశీ బిజినెస్‌కి ఆకోన్ వ‌ల్ల క‌లిసొస్తుందేమో చూడాలి. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్ రైట్స్ భారీ ధ‌ర‌కు అమ్మేశారు. లోక‌ల్ బిజినెస్ అంతే స్పీడ్ మీద ఉంద‌ని తెలుస్తోంది.