వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలి..బాబు నివాసానికి నోటీసులు

Saturday, September 21st, 2019, 10:53:42 AM IST

అమరావతిలో చంద్రబాబు నాయుడు ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కి సీఆర్డీఏ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. గతంలో ఒకసారి నోటీసులు జారీచేయడంతో గెస్ట్ హౌస్ ఓనర్ అయిన లింగమనేని రమేష్ సీఆర్డీఏ అధికారులకి వివరణ ఇచ్చాడు. అయితే ఆ వివరణపై సంతృప్తి చెందని అధికారులు మరోసారి నోటీసులు ఇస్తూ గెస్ట్ హౌస్ గోడకి అంటించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఫస్ట్‌ఫ్లోర్‌, స్విమ్మింగ్‌పూల్‌, ఫస్ట్‌ఫ్లోర్‌లోని డ్రెసింగ్‌ రూమ్‌.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని అధికారులు నోటీసులో పేర్కొన్నారు.

దీనితో ఆ గెస్ట్ హౌస్ ని వారం రోజుల్లో ఖాళీ చేయాలనీ వాళ్ళు ఆదేశాలు జారీచేశారు. దీనిపై లింగమనేని రమేష్ మాట్లాడుతూ సీఆర్డీఏ అధికారులకి నేను ఇంతకుముందే వివరణ ఇచ్చాను. కానీ మరోసారి నోటీసులు ఇచ్చారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఫస్ట్‌ఫ్లోర్‌, స్విమ్మింగ్‌పూల్‌, ఫస్ట్‌ఫ్లోర్‌లోని డ్రెసింగ్‌ రూమ్‌.. నిబంధనలకు అనుకూలంగానే నిర్మించాను. నేను ఈ నిర్మాణం చేసేటప్పుడు అసలు సీఆర్డీఏ లేదు, ఉండవల్లి గ్రామ పంచాయితీ అనుమతి తీసుకోని నిర్మించానని చెప్పుకొచ్చాడు.

మరి దీనిపై బాబు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. అధికారులు చెప్పినట్లు దానిని ఖాళీ చేసి మరోచోటికి వెళ్ళిపోతాడా..? లేక దీనిపై పోరాటానికి దిగుతాడా అనేది చూడాలి. కాకపోతే ఇది బాబు సొంత నివాసం కాదు కాబట్టి దీనిపై పబ్లిక్ గా బాబు ఎలాంటి హడావిడి చేయటానికి ఛాన్స్ లేదు. లేకపోతే ఈపాటికే దీనిపై పోరాటం మొదలుపెట్టేవాడు చంద్రబాబు