అఖిల్ కోసం కొత్త హీరోయిన్ కాదట ?

Wednesday, March 28th, 2018, 10:36:51 AM IST

అక్కినేని చిన్నోడు అఖిల్ హీరోనా నటించే మూడో సినిమా తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఇటీవలే మొదలైన విషయం తెలిసిందే. అఖిల్ హీరోగా పరిచయం అవుతూ చేసిన అఖిల్ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. ఆ తరువాత గ్యాప్ తీసుకుని చేసిన హలో కూడా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. దాంతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని కసితో ఈ సారి యువ దర్శకుడితో సినిమాకు కమిట్ అయ్యాడు అఖిల్. అయితే అయన చేసిన రెండు సినిమాల్లో కొత్త హీరోయిన్స్ తీసుకోవడం వల్ల వాళ్లు సినిమాకు పెద్దగ ప్లస్ కాలేకపోయారని ఈ సారి క్రేజ్ ఉన్న హీరోయిన్ ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. మరి అఖిల్ సరసన నటించే ఆ క్రేజీ హీరోయిన్ ఎవరన్నది త్వరలోనే ప్రకటిస్తారట.