ఏపీ లో నేటి నుండి కర్ఫ్యూ వేళల్లో మార్పులు!

Friday, June 11th, 2021, 12:13:53 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే కరోనా వైరస్ ను అరికట్టడం కోసం రాష్ట్రం లో కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నేటి నుండి రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేయడం జరిగింది. అయితే ఇటీవల ఈ నెల 20 వ తేదీ వరకు కర్ఫ్యూ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ కర్ఫ్యూ నుండి సడలింపు ఇవ్వడం జరిగింది. అయితే ఇదివరకు ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉండగా, తాజాగా దాన్ని మార్పులు చేయడం జరిగింది. అయితే ఈరోజు నుండి మధ్యాహ్నం రెండు గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కూడా కర్ఫ్యూ అమలు కానుంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం తో ప్రజలు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అని తెలుస్తోంది.