ఇంకా కన్ఫ్యూజన్ లో .. నరేష్ దయ్యం .. !!

Friday, November 25th, 2016, 12:38:59 PM IST

intlo-dhayyam-nakem-bayyam
పెద్ద నోట్ల రద్దుతో .. చాలా సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి? మరికొన్ని సినిమాల విడుదలలు వెనక్కి తగ్గాయి. కానీ కొన్ని సినిమాలను దైర్యం చేసి విడుదల చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో విడుదలకు సిద్ధం అయిన అల్లరి నరేష్ ”ఇంట్లో దయ్యం నాకేం భయం” సినిమా విడుదల వాయిదా వేశారు, ఈ నెల 12 న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పటికి ఇంకా విడుదల విషయం పై ఎలాంటి సమాచారం లేదు, ఆ తరువాత వచ్చిన సినిమాలు కొన్ని విడుదలై మంచి టాక్ తో రన్ అవుతున్నాయి. లేటెస్ట్ గా నిఖిల్ నటించిన ”ఎక్కడికి పోతావు చిన్నవాడా” విడుదలై మంచి టాక్ తో రన్ అవుతుంది. మొత్తానికి పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ తో భయపడిన అల్లరి నరేష్ దయ్యం .. మాత్రం విడుదల కోసం ఎదురు చూస్తుంది. జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్టైనర్ హిట్ అవుతుందన్న నమ్మకం లేకే విడుదల విషయంపై ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నారా ? లేక ఇప్పటికే డిసెంబర్ లో చరణ్ ధ్రువ, సూర్య సింగం 3 సినిమాలు లైన్ లో ఉన్నాయి, మరి ఈ సినిమాల పోటీ తట్టుకుంటుందా అనే సందేహాలు కలుగుతున్నాయి జనాలకు !! మరి ఈ దయ్యానికి మోక్షం ఎప్పుడొస్తుందో చూడాలి !!