అడ్డంగా బుక్డ్‌: కోటి కాదు 10 కోట్ల‌యినా మార్చేస్తాడుట‌!!

Sunday, November 27th, 2016, 02:44:16 PM IST

money
కొత్త క‌రెన్సీ లేదు అంటూ బ్యాంకుల‌న్నీ బోర్డులు తిప్పేశాయ్‌. ఏటీఎంల‌న్నీ బంద్‌. మూడు రోజుల(శ‌ని, ఆది, సోమ‌) పాటు బ్యాంకులు ప‌ని చెయ్య‌వు. కానీ ఆర్బీఐ- హైద‌రాబాద్‌ నుంచి మాత్రం డ‌బ్బు ఎంత‌యినా తీసుకోవ‌చ్చు. ఎవ‌రైనా మీ ద‌గ్గ‌ర కోట్ల‌లో క‌రెన్సీ ఉంటే తీసుకు రండి .. మేం మార్చేస్తాం అంటూ ఆ పాన్‌షాప్ వాలా ధైర్యంగా చెప్పేసి అడ్డంగా టీవీ -9 కెమెరాల‌కు దొరికిపోయాడు. ఈ దందాలో అత‌డు ఆర్బీఐ (హైద‌రాబాద్‌) లోనికి వెళ్లి కావాల్సినంత తెచ్చుకోగ‌ల‌న‌ని చెప్పేశాడు. ఇక్కడ ఇంత‌మంది పోలీసులు తిరుగుతుంటే ఈ దందా ఎలా చేస్తావు బాసూ? అని ప్ర‌శ్నిస్తే .. హ్హ‌హ్మ.. పోలీసోల్లు కూడా ఇందులో భాగ‌మే క‌దా భాయ్‌.. అంటూ చాలా ఘ‌రానాగా చెప్పాడు మ‌రి! కోటి వ‌దులుకోలేక ఆర్బీఐ అధికారులకు సంబంధించిన కొన్ని క్లూస్ వ‌దిలాడు స‌ద‌రు పాన్‌షాప్ వాలా. ఇంత‌కీ ఆయ‌న పేరేంటి? మునీర్..

ఇక్క‌డో గ‌మ్మ‌త్త‌యిన విష‌యం ఏమంటే.. టీవీ 9 వాళ్లు వెంట‌ప‌డుతుంటే స‌ద‌రు పాన్‌షాప్ వాలా ఆ ప్లేస్‌ని, షాప్‌ని వ‌దిలి పారిపోయాడు. ఆర్బీఐ ముందు తిరిగే పోలీసులు ఇందులో క‌మీష‌న్ పార్ట‌న‌ర్స్‌. నాకు చివ‌రికి మిగిలేది ఐదు శాత‌మే .. అని అన్న వాడు కాస్తా టీవీ కెమెరాని గ‌మ‌నించి ఉడాయించాడు. అయితే ఇంత దందా సాగుతుంటే … ఇదంతా తెలిసీ అస‌లు దొంగ‌ల‌కు శిక్ష ప‌డుతుందా? లేదా? అన్న‌ది చూడాలి. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ఎవ‌రి తాట తీస్తారు? వేచి చూడాలి. కోటి కోసం ఆశ‌ప‌డి అడ్డంగా బుక్క‌యిపోయిన స‌ద‌రు పాన్‌షాప్ వాలాకి పోలీసులు బెండు తీయ‌డం ఖాయం. ప్ర‌స్తుతం సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్‌, ఇన్వెస్టిగేష‌న్ బ్యూరోకి ఈ స‌మాచారం అందించింది స‌ద‌రు మీడియా. వెయిట్ అండ్ సీ.