బ్రేకింగ్: చంద్రబాబుకి ఇది గట్టి దెబ్బే…ఎలా రియాక్ట్ అవుతారో?

Thursday, October 17th, 2019, 12:56:04 PM IST

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలుగు దేశం పార్టీ కి దిక్కు తోచని పరిస్థితి ఎదురయ్యంది. జగన్ పై విమర్శలు గుప్పించడం, సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు జరగడం వంటివి అయ్యాయంటూ, అరెస్ట్ అవ్వడం వంటి చర్యలను మనం చూసాం. అయితే చిత్తూరు జిల్లా తిరుపతి కి చెందిన మేదరమెట్ల సురేష్ ని పోలీసులు అరెస్ట్ చేసారు, అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరు పరిచారు. సురేష్ జగన్ పై సోషల్ మీడియా లో అసభ్యకర, అభ్యంతకర రీతిలో పోస్టులు పెట్టినందుకు గాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

చంద్రబాబు నాయుడు ఇప్పటికే జగన్ పై, పోలీస్ విభాగం పై ప్రశ్నలు గుప్పిస్తూనే వున్నారు. టీడీపీ మద్దతుదారుల పై వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసుల్ని పెట్టి తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ చాల సార్లు విమర్శలు చేసింది. తాజాగా జరిగిన సంఘటన తో టీడీపీ శ్రేణులు మరింత కలత చెందే అవకాశం వుంది. ఇప్పటికే ఈ విషయం లో చంద్రబాబు చాల పోరాడారు, ఈ సంఘటన చంద్రబాబు కి పెద్ద దెబ్బె అని చెప్పాలి. కృష్ణ వరదల సమయం లో కూడా కొంతమంది టీడీపీ కార్యకర్తలను సోషల్ మీడియా లో వైసీపీ పై,జగన్ పై దుష్ప్రచారం చేసినందుకు గానూ అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే.