శ్రీ రెడ్డి ఎఫెక్ట్ : పరారీలో అభిరాం.. ఆందోళ‌ణ‌లో ద‌గ్గుబాటి ఫ్యామిలీ..?

Wednesday, April 11th, 2018, 06:45:51 PM IST

టాలీవుడ్ లెంజెండ‌రీ దివంగ‌త నిర్మాత శ్రీ ద‌గ్గుబాటి రామానాయుడు, అత‌ని కుమారులు నిర్మాత సురేష్‌, హీరో వెంక‌టేష్ అసలు ఉన్నారా లేరా అన్నట్టుగా ఎప్పుడూ వివాదాల‌కు చాలా దూరంగా ఉంటారు. వారి హ‌యాంలో ఏనాడూ ద‌గ్గుబాటి ఫ్యామిలీ వివాదాస్పద వార్తలతో మీడియా కు ఎక్కినా దాఖలాలు లేవు. అలాంటిది గ‌త ఏడాది సౌత్ ఇండ‌స్ట్రీని ఊపేసిన సుచీ లీక్స్‌లో రాణా-త్రిష‌ల ఫొటోలు లీక్ అయిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఆ సంఘ‌ట‌న‌లు మ‌ర్చిపోక ముందే శ్రీరెడ్డి లీక్స్ అంటూ కొద్ది రోజులుగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. చిన్న‌గా మొద‌లైన శ్రీరెడ్డి వివాదం.. రోజురోజుకీ ముదిరి ఏకంగా మీడియాలో ఫొటోల లీక్స్ వ‌ర‌కు వెళ్ళింది. తాజాగా ఓ టీవీ ఛాన‌ల్‌లో రానా త‌మ్ముడు అభిరాంతో శ్రీరెడ్డి రొమాంటిక్ ఫొటోలు లీక్ చేయ‌డంతో ఇండ‌స్ట్రీ మొత్తం ఒక్క‌సారిగా షాక్ తింది. దీంతో సురేష్ బాబు, వెంక‌టేష్, రాణాలు బ‌య‌ట ముఖం చూపించ‌లేక‌పోతున్నారని స‌మాచారం.

ఇక గ‌త రాత్రి నుండి ఈ ఫోటోలు మీడియా లో, సోషల్ మీడియా లో వైరల్ కావడం తో వీటిని చూసిన చాలామంది సురేష్ బాబుకు , వెంకటేష్‌కు, రాణాకు ఫోన్లు చేయడం మొదలు పెట్టారట. వారికీ సమాదానాలు చెప్పలేక వీరు తమ ఫోన్లను స్విచ్ హాఫ్ చేసినట్లు చెపుతున్నారు. ఇక ఈ మ్యాట‌ర్ బ‌య‌ట‌కి రావ‌డంతో అభిరాం ఎక్క‌డికో వెళ్ళిపోయాడ‌ని.. దీంతో ద‌గ్గుబాటి ఫ్యామిలీ ఆందోళ‌న చెందుతోంద‌ని.. సినీ వ‌ర్గాల నుడి ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. సినిమాల పరంగా అభిరామ్ లైమ్ లైట్‌లోకి ఇంకా రాలేదు… అతడింకా హీరో కాలేదు… హీరోను చేసే ప్రయత్నాలు మాత్రం కొనసాగుతున్నాయి. అయితే అంతలోనే అతడిపై ఈ మరక పడడం.. ఇది అతడి కెరీర్ ను ఎటు లాకెళ్తుందో అని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments