సార్ కి దొరతనం తగ్గలేదు!

Monday, September 15th, 2014, 06:39:14 PM IST


హైదరాబాద్ జల విహార్ లో జరిగిన టిపిసిసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డి శ్రీనివాస్ రావుపాల్గొని అనంతరం విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు దొరతనం ఇంకా దిగలేదని, అందుకే దళితుడైన ఉపముఖ్యమంత్రి రాజయ్యను అవమానించారని తీవ్రంగా విమర్శించారు. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికలు షెడ్యుల్ ప్రకారం నవంబర్ లో నిర్వహించాలని, ఇంకా ఆలస్యం చేస్తే ఎన్నికలకు కెసిఆర్ భయపడుతున్నట్లు లెక్క అని డీఎస్ ఎద్దేవా చేశారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ జనరల్ ఎలక్షన్స్ లో టిడిపి-బీజేపీకి ఓటేసిన సెటిలర్లు సంతోషంగా లేరని, ఇప్పుడు ఏ ఎన్నికలు జరిగినా వారంతా కాంగ్రెస్ పార్టీకే మద్దతిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడున్న ఈ పరిస్థితిని కాంగ్రెస్ నేతలు జీహెచ్ఎంసీ ఎన్నికలకు అనుకూలంగా మార్చుకోవాలని డి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.