చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్‌ నుంచి `16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్‌`

Monday, January 30th, 2017, 10:52:51 AM IST

16
`బిచ్చ‌గాడు` సినిమాతో సంచ‌ల‌న విజ‌యం అందుకుని తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో అనువాద చిత్రాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారారు చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్‌. శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్ నుంచి వ‌రుస‌గా స‌క్సెస్‌ఫుల్ చిత్రాలు తెలుగులో రిలీజ‌వుతున్నాయి. అదే కోవ‌లో ఇప్పుడు మ‌రో థ్రిల్ల‌ర్ మూవీ ఈ సంస్థ నుంచి రిలీజ్‌కి వ‌స్తోంది. `ధురువంగ‌ల్ ప‌దినారు` (డి-16) పేరుతో ఇటీవ‌ల రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించిన త‌మిళ చిత్రాన్ని తెలుగులో `16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్‌` పేరుతో అనువ‌దిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ని లాంచ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత చ‌ద‌వ‌ల‌వాడ ప‌ద్మావ‌తి మాట్లాడుతూ -“త‌మిళంలో ఇటీవ‌ల రిలీజైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇప్ప‌టికీ చ‌క్క‌ని వ‌సూళ్ల‌తో దూసుకెళుతోంది. డెబ్యూ హీరో కార్తీక్ న‌రేన్‌, రెహ్మాన్ ప్రాధాన‌పాత్ర‌ల్లో న‌టించారు. త‌మిళ క్రిటిక్స్ ప్ర‌శంస‌లు పొందిన రేర్ మూవీ ఇది. సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్‌కుమార్ ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. సుజిత్ స‌రంగ్ కెమెరా వ‌ర్క్‌, జాకేష్ బిజోయ్ సంగీతం, రీరికార్డింగ్ హైలైట్‌. తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించే అన్నిర‌కాల అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో స‌రికొత్త అనుభూతినిచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయి. సాధ్య‌మైనంత త్వ‌ర‌లోనే అనువాదం పూర్తి చేసి రిలీజ్ చేస్తాం“ అన్నారు.