డ‌బు ర‌త్నాని క్యాలెండ‌ర్‌పై స‌న్నీ విన్యాసాలు!

Wednesday, January 17th, 2018, 08:27:27 PM IST

ప్ర‌ముఖ బాలీవుడ్ ఫోటోగ్రాఫ‌ర్ డ‌బు ర‌త్నాని ప్ర‌తియేటా జ‌న‌వ‌రిలో క్యాలెండ‌ర్‌ని లాంచ్ చేస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ క్యాలెండ‌ర్‌లో బాలీవుడ్ గ్లామ‌ర్ క‌ళ్లు తిప్పుకోనివ్వ‌దు. టాప్ హీరోయిన్ల‌తో పాటు హీరోల ఫోటోల్ని ఈ క్యాలెండర్‌లో ప్ర‌త్యేకంగా తీర్చి దిద్దుతారు. ఈ స్పెష‌ల్లీ డిజైన్డ్‌ క్యాలెండ‌ర్ తో చాలామంది కి ద‌శ దిశ తిరిగిపోయిన సంద‌ర్భాలు ఉన్నాయంటే అతిశ‌యోక్తి కాదు. గ‌త రెండు ద‌శాబ్ధాలుగా డ‌బు ర‌త్నానీ ఫోటోగ్ర‌ఫీకి ప్ర‌త్యేక స్థానం ఉంద‌క్క‌డ‌. ఎప్ప‌టిలానే ఈసారి కూడా 24 మంది తార‌లను ప్ర‌త్యేకంగా ఫోటో షూట్ చేశారు డ‌బు ర‌త్నానీ.

ఇటీవ‌లి కాలంలో ఒక‌టే ఫోటోషూట్ సంద‌డి. డ‌బు ర‌త్నానీ ట్విట్ట‌ర్, ఎఫ్‌బి స‌హా అన్నీ వీడియోలు, ఫోటోల‌తో ద‌ర్శ‌న‌మిస్తోంది. ఈ ఫోటోలు, వీడియోల్లో స‌న్నీలియోన్ సంథింగ్ స్పెష‌ల్‌గా క‌నిపించింది. ఓ ప‌న‌మ్మాయి.. చీపురు ప‌ట్టుకుని తుడ‌వ‌డం.. బాత్రూమ్ క్లీన్ చేయ‌డం ఇదీ కాన్సెప్ట్‌. ఆ కాన్సెప్టులో స‌న్నీ ఎంత‌గా ఇన్వాల్వ్ అయిపోయిందో ఇదిగో ఈ వీడియో చెబుతోంది. అంతంద‌మైన అమ్మాయి ప‌న‌మ్మాయిగా సెట్ట‌యితే ఇంకేమైనా ఉందా?

A post shared by Dabboo Ratnani (@dabbooratnani) on