డ‌బు ర‌త్నానీ (వ‌ర్సెస్‌) టైగ‌ర్ ష్రాఫ్‌

Wednesday, January 17th, 2018, 12:32:49 PM IST

భాఘి 2 చిత్రంలో న‌టిస్తున్నాడు టైగ‌ర్ ష్రాఫ్‌. ఓ వైపు సినిమాల‌తో, మ‌రోవైపు గాళ్ ఫ్రెండ్‌తో బిజీ బిజీ. ఇటీవ‌లే గాళ్ ఫ్రెండుతో క‌లిసి ఓ దీవికి వెళ్లి కొత్త సంవ‌త్స‌రం సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నాడు. లోఫ‌ర్ భామ దిశా ప‌టానీతో చెట్టాప‌ట్టాల్ వేసుకుని తిరిగేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు కెమెరా కంటికి చిక్కుతూనే ఉన్నాడు. ఈ ఇద్ద‌రికి ఇప్ప‌టికే పెళ్ల‌యిపోయింది అన్న ప్ర‌చారం సాగుతోంది. అదంతా స‌రే.. టైగ‌ర్ ష్రాఫ్ త‌న స్ట‌న్నింగ్ లుక్‌ని ఎలివేట్ చేస్తూ డ‌బు ర‌త్నానీ పోటోషూట్‌కి ఫోజులిచ్చాడు.

ఓవ‌రాల్‌గా 24 మంది స్టార్లు క‌నిపించే ఈ క్యాలెండ‌ర్‌లో టైగ‌ర్ చాలా ప్ర‌త్యేకంగా క‌నిపిస్తాడ‌న‌డంలో సందేహం లేదు. ఇక‌పోతే ఈ క్యాలెండ‌ర్‌లోనే ఐశ్వ‌ర్యారాయ్‌, ప్రియాంక చోప్రా, క‌త్రిన స‌హా ప‌లువురు టాప్ హీరోయిన్ల ఫోటోల్ని డ‌బు ర‌త్నానీ సిద్ధం చేస్తున్నారు. అయితే టైగ‌ర్ ల‌వ‌ర్ దిశా ప‌టానీ ఈ క్యాలెండ‌ర్‌లో ఉందా? లేదా? అన్న‌ది తెలియాల్సి ఉందింకా.