డల్లాస్ మీట్ ఎఫెక్ట్: వైసీపీలో, టీడీపీ ఆర్గనైజేషన్లు కలిసిపోనున్నాయా..!

Monday, August 19th, 2019, 12:05:47 AM IST

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా అమెరికా పర్యటనలో ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి హొదాలో మొట్టమొదటి సారిగా అమెరికా వెళ్ళిన సీఎం జగన్‌కు అక్కడి తెలుగువారు ఘన స్వాగతం పలికారనే చెప్పాలి. అంతేకాదు జగన్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన దగ్గరి నుంచి డల్లాస్‌లో ప్రసంగించే సభ వరకు అన్ని విషయాలలోనూ కార్యక్రమ నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు.

అయితే అమెరికాలోని వైసీపీ అభిమానుల మరియు మరికొన్ని ఆర్గనైజేషన్లు కలిసి కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించారు. అయితే జగన్ రాకతో వేలాది మంది తెలుగు అభిమానులు రావడంతో డల్లాస్‌లోని హచిన్సన్ కన్వెన్షన్ సెంట్రల్ హాల్ జనంతో కిక్కిరిసిపోయింది. అయితే తెలుగువారందరూ ఈ రేంజ్‌లో ఈవెంట్‌కు హాజరయ్యారంటే అక్కడ జగన్ క్రేజ్ ఎలా ఉందో పెద్దగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ ఈవెంట్ ఇంతగా విజయం సాధించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి లోకల్ ఆర్గనైజేషన్ వారే కాకుండా కొన్ని టీడీపీ ఆర్గనైజేషన్‌ల వారు కూడా ఈవెంట్ నిర్వహణలో పాల్పంచుకున్నారట. అంతేకాదు కొన్ని టీడీపీ ఆర్గనైజేషన్‌లు వైసీపీ ఆర్గనైజేషన్‌లలో మమేకం అయ్యాయని లోలోపల వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందనేది మాత్రం తెలియదు కానీ జగన్ డల్లాస్ మీట్ ఎఫెక్ట్ మాత్రం ఏమైనా టీడీపీపై పడి ఉండవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి.