మాజీ నేత కోడెలకు,నారమల్లి శివ ప్రసాద్ లకు ఘన నివాళి అర్పించిన ఎన్నారై టీడీపీ

Sunday, September 22nd, 2019, 11:42:38 AM IST

మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ , నారమల్లి శివ ప్రసాద్ లకు డల్లాస్ ఎన్నారై టీడీపీ నివాళులు అర్పించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గొన్నారు. కోడెల శివ ప్రసాద్ గారి గురించి పలు విషయాలు వెల్లడించారు. కోడెల ని గురువుగా సంబోధించి అయన పై గల అభిమానాన్ని తెలిపారు. కోడెల శివ ప్రసాద్ గారితో పని చేయడం, పలు విషయాల చర్చల పట్ల తన పై అభిమానాన్ని బోడె ప్రసాద్ వెల్లడించారు. మాజీ మంత్రి శివ ప్రసాద్ ల గురించి మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోసం తానూ కష్ట పడిన విధానాన్ని వివరించారు. శివ ప్రసాద్ అప్పట్లో భిన్నంగా నిరసన తెలిపి ప్రత్యేక హోదా పోరాటంలో కీలక పాత్ర పోషించారని అన్నారు.

ఈ కార్యక్రమాన్ని అర్వింగ్ లోని కూచి పూడి హోటల్ లో జరిపారు. మాజీ స్పీకర్ కోడెల శివ ప్రాడ్ మరియు నారమల్లి శివ ప్రసాద్ లకు రెండు నిమిషాల పాటు మౌనం వహించి, నివాళులు అర్పించారు ఈ కార్యక్రమం లో అనిల్ వీరపనేని, శ్రీనివాస్ జంపని, వెంకట్ జిల్లెళ్ళమూడి, నవీన్ఎర్రమనేని, కిరణ్ తుమ్మల, సందీప్ మేక, చందు కాజ, శ్రీనివాస్ శాఖమూరి, గుమ్మడి నవీన్, కొండ్రకుంట చలపతి రావు, కొణిదెల లోకేష్ నాయుడు పలువురు స్థానిక ప్రవాసులు, ముఖ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శివప్రసాద్ లకు వారితో వున్నా అనుబంధాన్ని చర్చించుకున్నారు.

ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి