మహారాజు.. సాయం అందింది !

Friday, September 16th, 2016, 08:33:00 PM IST

Dana-Majhi
కొన్ని రోజులక్రితం ఒడిశాకు చెందిన వ్యక్తి మాంజీ తన చనిపోయిన భార్య శవాన్ని వాహనంలో తీసుకెళ్లడానికి డబ్బులు లేక 60 కిలోమీటర్లు మోసుకెళ్లడానికి సిద్ధపడిన సింగతి తెలిసిందే. ఈ మీడియా ద్వారా దేశ మంతటా ప్రధాన వార్తగా మారింది.మీడియ పుణ్యమా అని ఈ వార్త ఎక్కడో బెహ్రయిన్ రాజు ఖలీఫా బిన్ సల్మాన్ కంట పడింది. దీనితో చలించిపోయిన రాజు మంజీకి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అతనికి సాయం చేస్తునట్లు ప్రకటించారు.

దీనితో బెహ్రయిన్ రాజు రూ 8.87 లక్షల చెక్కుని ఢిల్లీలోని బెహ్రయిన్ ఎంబసీ ద్వారా మంజీకి అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన మంజి ఈ మొత్తాన్ని బ్యాంకు లో వేసి తన పిల్లల చదువులకు ఉపయోగిస్తానని తెలిపారు.