శర్వానంద్ కోసం వెయిటింగ్ లో సంచలన దర్శకుడు ?

Thursday, May 3rd, 2018, 10:36:14 AM IST

స్లో అండ్ స్టడీ గా సినిమాలు చేస్తూ .. అలాగే వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు యువ హీరో శర్వానంద్. ఇటీవలే రాధా చిత్రంలో నటించిన ఆయనకు ఆశించిన స్థాయి విజయం దక్కలేదు. దాంతో మంచి హిట్ కోసం హను రాఘవాపుడితో సినిమాకు కమిట్ అయ్యాడు. దాంతో పాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న శర్వానంద్ కోసం ఓ సంచలన దర్శకుడు క్యూ లో ఉన్నాడు. అయన ఎవరో కాదు దండుపాళ్యం సినిమాతో సంచలనం క్రియేట్ చేసిన శ్రీనివాస రాజు. ఇప్పటికే శర్వానంద్ తో శ్రీనివాస్ రాజు కథ చర్చలు జరిపాడని, కథ విషయంలో కాస్త కన్ఫ్యూజ్ వల్ల ఈ ప్రాజెక్ట్ ని వైటింగ్ లిస్ట్ లో పెట్టాడని సమాచారం. అయితే శ్రీనివాస రాజు మాత్రం ఎలాగైనా సరే ఈ సినిమాను శర్వానంద్ తోనే తీయాలని ప్లాన్ చేస్తున్నాడట. మరి హను రాఘవపూడి, సుధీర్ వర్మ ల సినిమాలు పూర్తయితే ఈ దండుపాళ్యం దర్శకుడితో చేసే సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. ఓ రివెంజ్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్ !!

  •  
  •  
  •  
  •  

Comments