ఐదు రోజుల్లోనే ఆ సినిమా 150 కోట్లు వసూలు చేసింది

Thursday, December 29th, 2016, 05:41:16 PM IST

dangal
బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తాజాగా నటించి, నిర్మించిన ‘దంగల్ చిత్రం’ ప్రపంచవ్యాప్తంగా విజయ ఢంకా మోగిస్తుంది. విడుదలైన 5 రోజులలోనే ఒక్క ఇండియా లోనే 150 కోట్లు వసూలు చేసి 200 కోట్ల వైపు దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదలైన తొలిరోజునే (శుక్రవారం) 29.78 కోట్లు, శనివారం 34.82 కోట్లు, ఆదివారం 42.35 కోట్లు, సోమవారం 25.48 కోట్లు, మంగళవారం 23.07 కోట్లు మొత్తమ్మీద ఇప్పటివరకు 155.53 కోట్లు రాబట్టినట్టు సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేసాడు.

ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ నటనకు ప్రజలందరూ జేజేలు కొడుతున్నారు. విమర్శకులు కూడా ఆమిర్ ఖాన్ నటనను పొగుడుతున్నారు. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దంగల్ మూవీ చూసిన వర్మ ఆమిర్ ఖాన్ ను పొగడ్తలతో ముంచెత్తారు. మిగిలిన ఖాన్ లు తీస్తున్న సినిమాలు చూసి ప్రపంచమంతా భారతీయులను పిచ్చివాళ్లలా చూస్తుంటే, ఒక ఆమీర్ ఖాన్ సినిమాలు చూసి మనలను సీరియస్ గా తీసుకుంటున్నారని రాంగోపాల్ వర్మ అన్నాడు. మొత్తమ్మీద దంగల్ జోరు చాలా కలం కొనసాగేలా ఉంది. విదేశాలలో సైతం ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తుంది. విదేశాలలో మంగళవారం నాటికి వంద కోట్లకు చేరువ లోకి వచ్చినట్లు తెలుస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments