స్టార్‌స్క్రీన్ అవార్డ్స్‌ : 10 అవార్డులతో `దంగ‌ల్‌` హ‌వా!

Monday, December 4th, 2017, 02:12:30 PM IST

అమీర్‌ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `దంగ‌ల్‌` ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజై అసాధ‌ర‌ణ రికార్డులు నెల‌కొల్పిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా దాదాపు 2500 కోట్ల వ‌సూళ్లు సాధించింద‌ని ట్రేడ్ పేర్కొంది. 1900 కోట్ల వ‌సూళ్లు ద‌క్కాయ‌ని ఆ త‌ర్వాత మేక‌ర్స్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఇండియాలో దాదాపు 500 కోట్లు వ‌సూలు చేసిన దంగ‌ల్‌, చైనాలో ఏకంగా 1000 కోట్లు పైగా వ‌సూలు చేసి ఊహించ‌ని ఫ‌లితం అందుకుంది. ఒక భార‌తీయ సినిమాకి చైనాలో ఇంతటి మైలేజ్ ఉంటుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. అలాంటి గ్రేట్ మూవీ అవార్డులు- రివార్డుల్లో త‌క్కువ తింటుందా? ఇప్ప‌టికే దంగ‌ల్‌కి ప‌లు ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డుల్లో పెద్ద పీట ద‌క్కింది.

ఫిలింఫేర్ త‌ర్వాత అంత‌టి ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారాలుగా చెప్పుకునే, స్టార్‌స్క్రీన్ అవార్డ్స్‌లో `దంగ‌ల్‌` స‌త్తా చాటింది. మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ సినిమా ఏకంగా ప‌ది అవార్డులు ద‌క్కించుకుంది. ఉత్త‌మ ద‌ర్శ‌కుడు, ఉత్త‌మ చిత్రం, బెస్ట్ యాక్ష‌న్‌, ఉత్త‌మ ఎడిటింగ్‌, ఉత్త‌మ బిజిఎం, ఉత్త‌మ లిరిక్స్‌, ఉత్త‌మ సంగీతం, ఉత్త‌మ ర‌చ‌న‌, ఉత్త‌మ న్యూకామ‌ర్ మేల్‌& ఫీమేల్‌, ఉత్త‌మ బాల న‌టి పుర‌స్కారాలు ఈ సినిమాకి ద‌క్కాయి. ఇక దంగ‌ల్ హ‌వా ప‌లు అంత‌ర్జాతీయ సినిమా ఉత్స‌వాల్లోనూ కొన‌సాగింది. ప‌లు ప్ర‌తిష్ఠాత్మ‌క సినిమా వేడుక‌ల్లో స్పెష‌ల్ స్క్రీనింగులు చేశారు. ఇలాంటి కీర్తి ప్ర‌తిష్ఠ‌లు వేరొక సినిమాకి ద‌క్క‌లేదంటే అతిశ‌యోక్తి కాదు.

  •  
  •  
  •  
  •  

Comments