నన్ను అబ్బాయి అనుకున్నాడు.. దంగల్ హీరోయిన్

Saturday, October 21st, 2017, 06:40:10 PM IST

బాలీవుడ్ లో విడుదలైన దంగల్ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే అయితే ఆ సినిమా తర్వాత అందులో నటించిన అమ్మాయిలకు కి కూడా అమిర్ ఖాన్ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా రెజ్లర్‌ గీతా ఫొగాట్‌ చిన్నప్పటి పాత్రలో నటించిన జైరా వశిం చాలా ఫెమస్ అయ్యింది. అలాగే నటించిన మొదటి సినిమాకే నేషనల్ అవార్డును దక్కించుకుంది. ఇటీవల ఆమె మరోసారి అమిర్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న సీక్రెట్ సూపర్ స్టార్ చిత్రంతో వచ్చింది.

ఈ సినిమాలో కూడా అమ్మడు నటనలో మంచి మార్కులనే దక్కించుకుంది. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దంగల్ సినిమా తర్వాత తనకు ఎదురైనా ఒక విచిత్రైమైన అనుభవం గురించి చెప్పుకుంది. సినిమా విడుదల తర్వాత ఒక అబ్బాయి తన దగ్గరకు వచ్చి బయ్యా.. మీరు దంగల్ సినిమాలో నటించారు కదా! ఒక సెల్ఫీ ఇవ్వరా అని అడిగాడు. దీంతో నేను నవ్వు ఆపుకోలేకపోయాను. అతనికి నిజం కూడా చెప్పలేదని నవ్వుతు చెప్పింది జైరా. ఇక ప్రస్తుతం ఆఫర్స్ బాగానే వస్తున్నాయని చెబుతూ.. నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుంటానని చెప్పింది.

  •  
  •  
  •  
  •  

Comments