ఆమె పరిస్థితి నగ్న చిత్రంలా ఉందన్న మంత్రి.. తిప్పికొట్టిన నటి..!

Friday, January 20th, 2017, 06:21:44 PM IST

sai
దంగల్ చిత్రంతో అద్భుత నటన కనబరిచి దేశం దృష్టిని ఆకర్షించింది కాశ్మీరీ నటి జైరా వసీం.కాగా ఆమె కేంద్రం గా వివాదాలు ఆగడం లేదు.ఆమెపై వ్యాఖ్యలు చేసి మరో వివాదానికి కేంద్ర మంత్రి కారణమయ్యారు.కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ ఓ గ్యాలరీ లోని నగ్న చిత్రాన్ని జైరా వసీం కు అన్వయించారు.ఈ ఫోటో జైరా వసీం పరిస్థితికి అద్దంపట్టేలా ఉందంటూ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. దీనికి జైరా వసీం కూడా ఘాటుగానే స్పందించింది.

పంజరంలో బందీ అయి ఉన్న ముస్లిం యువతి చిత్రాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి..జైరా వసీం పరిస్థితి ఇలాగే ఉందంటూ కామెంట్ చేసారు. ఆయన పోస్ట్ పెట్టిన కొద్ది సేపటికే జైరా వసీం మంత్రికి ఘాటుగా రిప్లై ఇచ్చింది.” సార్ మీరు వర్ణించినట్లు ఈ బొమ్మతో నేనెలా కనెక్ట్ అవుతాను ? అసలు ఈ బొమ్మకు నాకు ఎలాంటి సారూప్యత లేదు.అయితే మీకో విషయం చెప్పాలి. బురఖా వేసుకునేవాళ్ళు అందంగానే కాదు.. స్వేచ్ఛగా కూడా ఉంటారు ” అంటూ మంత్రికి బదులిచ్చింది.వెంటనే స్పందించిన మంత్రి తన ఉద్దేశాన్ని నీవు తప్పుగా అర్థం చేసుకున్నావని బదులిచ్చాడు. నీ పరిథిలో నీవి ఎంతో సాధించావు.అలాగే బాలికలందరు కట్టుబాట్లను, నిబంధనలను దాటుకుని ఎదగాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.