మీ స్మార్ట్ ఫోన్‌లో ఈ యాప్‌లు ఉన్నాయా.. అయితే కొంప కొల్లేరే..!

Tuesday, August 20th, 2019, 09:48:14 PM IST

ప్రస్తుత మానవ జీవితంలో స్మార్ట్ ఫోన్ వాడకం అనేది బీభత్సంగా పెరిగిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి రోజు ఉదయం లేచినపట్టి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదోఒక అవసరానికి మనం ఫోన్ వాడుతూనే ఉంటాం. అయితే చిన్న ఫోన్‌లు వాడే వారికన్నా స్మార్ట్ ఫోన్ వాడే వారి సంఖ్యనే ఎక్కువగా ఉంది. అయితే నిత్యం కొత్త పీచర్లతో మార్కెట్‌లోకి రకరకాల మొబైల్ ఫోన్లు వస్తున్నాయి.

అయితే స్మార్ట్ ఫోన్‌లను వాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం కొన్ని అనేక పరిణామాలను ఎదురుకోవలసి ఉంటుంది. ఎందుకంటే రోజు ప్లేస్టోర్‌లోకి రకరకాల యాప్‌లు వస్తుంటాయి. ఏదో బాగుంది కదా చాలా మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు అని మీరు కూడా డౌన్‌లోడ్ చేసుకుందామని అనుకుంటారు. అయితే కొన్ని కొన్ని యాప్‌లు మన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తాయని యాప్ డౌన్‌లోడ్ చేసేందుకు మనం ఇచ్చే పర్మిషన్‌లే మన కొంప ముంచుతాయని అంటున్నారు. తాజాగా డాక్టర్‌ వెబ్‌ అనే యాంటీ వైరస్‌ సంస్థ గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఉన్న ప్రమాదకరమైన యాప్‌లను ప్రకటించి ఈ యాప్‌లను వాడకుండా ఉండడమే మంచిదని సూచనలిచ్చింది. అయితే డాక్టర్‌ వెబ్‌ ఏవైనా యాప్‌లు ప్రమాదం అని చెబితే గూగుల్ తన ప్లేస్టోర్‌ నుంచి ఆ యాప్‌లను వెంటనే తొలగిస్తుంది. అయితే కింద ఇచ్చిన ఏదైనా యాప్‌ మీ ఫోన్‌లో ఉండి ఉంటే ఓ సారి గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ఆ పేరుతో గల యాప్ ఉందొ లేదో సెర్చ్‌ చేయండి. ఒకవేళ గూగుల్‌లో ఆ యాప్‌లను తొలగించి ఉంటే మీరు కూడా ఆ యాప్‌లను మీ ఫోన్‌లో డిలీట్ చేయడం మంచిది. అయితే ప్లేస్టోర్‌లో ఉండే అన్ని యాప్‌లు ప్రమాదకరమైనవి కాదని, కేవలం కొన్ని మాత్రమే ప్రమాధభరితంగా ఉన్నాయని ఈ సంస్థ తేల్చి చెప్పింది.

1) Pedometer Step Counter
2) EMI Calculator – Loan & Finance Planner
3) English Urdu Dictionary
4) Cricket Mazza Live Line
5) ai.type keyboard Plus + Emoji
6) QR Code Reader
7) QR & Barcode Scanner
8) GPS Route Finder
9) Ixigo Train
10) Who deleted me?
11) Who unfriended me?
12) Notepad – Text Editor PRO
13) Notepad – Text Editor PRO (different APK)
14) Power VPN Free VPN for Android
15) Video to MP3 Converter, RINGTONE Maker, MP3 Cutter
16) Remove Unwanted Object
17) GPS Speedometer PRO
18) GPS Speedometer
19) PDF Viewer
20) Route Finder
21) GPS Fix
22) Webcams
23) Bombuj
24) Social Studies (a Russian app)
25) 1300 Math Formulas Mega Pack
26) Sikh World – Nitnem & Live Gurbani Radio
27) OK Google Voice Commands (Guide)
28) Ramadan Times: Azan, Prayer Times & Qibla
29) Prayer Times: Azan, Quran, Qibla Compass
30) Al Quran Mp3 – 50 Reciters & Translation Audio
31) Full Quran MP3 – 50+ Audio Translation & Languages
32) Qibla Compass – Prayer Times, Quran, Kalma, Azan
33) Muslim Prayer Times & Qibla Compass