ఆమెను అక్కడ భరించలేక మగవాళ్ల జైలులో పెట్టారు….!

Friday, January 20th, 2017, 06:02:32 PM IST

women
ఆస్ట్రేలియాలో ‘ఐస్ క్రీం కిల్లర్’ గా కలకలం సృష్టించిన ఒక మహిళను అక్కడ పురుషుల జైలుకు తరలిస్తున్నారు. ఆమెతో పాటు ఉన్న ఇతర మహిళా ఖైదీలకు ఆమె నుండి ప్రమాదం పొంచి ఉండడంతో అక్కడి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. తన ఇద్దరు భర్తలను రెండు సంవత్సరాల వ్యవధిలో అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఎస్టిబాలిజ్ కరాంజా అనే మహిళకు 2012లో యావజ్జీవ కారాగార శిక్ష పడింది.

38 సంవత్సరాల కరాంజా ఇద్దరు భర్తలను పిస్టల్ తో తలపై కాల్చి చంపేసింది. వారి ఇద్దరి శరీరాలను రంపంతో ముక్కలుగా కోసి కొన్ని భాగాలను ఫ్రిజ్ లో దాచి ఉంచింది. మరి కొన్ని భాగాలను తన ఐస్ క్రీమ్ దుకాణంలోనే పూడ్చేసింది. ఈ సంఘటన జరిగిన దగ్గర నుండి ఆమెను పోలీసులు ‘ఐస్ క్రీం కిల్లర్’ అని పిలవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆమె ఒక మహిళా కారాగారంలో శిక్ష అనుభవిస్తుంది. ఇప్పుడు ఆమెను ప్రత్యేకంగా పురుషులు మాత్రమే ఉండే జైలుకు తరలిస్తున్నట్టు యూకే మీడియా వెల్లడించింది. ఆమెతో పాటు మరొక 13మంది మహిళా ఖైదీలను కూడా 90 మంది మెగా ఖైదీలు ఉన్న జైలుకు పంపుతున్నట్టు చెప్పారు.