కుక్క‌ల్ని మ‌ర్డ‌ర్ చేసి ప్ర‌భుత్వాల‌కు వార్నింగ్‌!

Wednesday, September 28th, 2016, 01:16:57 AM IST

dogs
దేశంలో చోటు చేసుకుంటోన్న రాజ‌కీయాలు చాలా సిత్రంగా ఉంటున్నాయి. మొన్నామ‌ధ్య ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ దోమ‌ల‌పై అంతా యుద్దం చేయాల్సిందే… విట‌కీ పేద‌, ధ‌న‌క‌ వ‌ర్గాలంటూ ఎవీ ఉండ‌వు.. వాటికి కావాల్సింది మ‌నుషుల ర‌క్తం మాత్ర‌మే … సో యుద్దం చేయ‌క త‌ప్ప‌ద‌ని హెచ్చరించారు. ఈ కామెంట్స్ అంద‌రికీ చాలా గ‌మ్మ‌త్తుగా అనిపించాయి. తాజాగా కేర‌ళలో ఓ ఆస‌క్తిర ఘ‌ట‌న ద్వారా కేంద్రానికి నిర‌స‌న తెలియ‌జేశారు కొంద‌రు.

కొన్ని నెల‌ల నుంచి ఆ రాష్ట్రంలో కుక్క‌లు మనుషుల‌పై దాడులు చేస్తున్నాయ‌ట‌. ఆ దాడులు మ‌రీ శృతిమించిపోయినా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌ట‌. దీంతో కాంగ్రెస్ ( ఎం) యూత్ వింగ్ కార్య‌క‌ర్త‌లు నేరుగా రంగంలోకి దిగి కుక్క‌ల‌పై వేట మొద‌లెట్టారు. దొరికిన శుక‌నాన్ని దొరికిన‌ట్లే ఏసేశారు. అంతే రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా శున‌కాల మృత‌దేహాల‌తో ర్యాలీ చేశారు. ఆ ఘ‌ట్టం ముగిసిన త‌ర్వాత వాటిని పోస్టాఫీస్ ముందు వ‌దిలి వెళ్లారు.

కేంద్ర, రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు గొప్ప ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్ట‌క‌పోయినా ప‌ర్వాలేదు గానీ, కనీసం శున‌కాల నుంచి మ‌నుషుల ప్రాణాల‌ను కాపాడండ‌ని వేడుకుంటున్నారు మ‌ల‌యాళీలు. లేదంటే మునుముందు ఇలాంటి దాడులు శునకాల నుంచి ఎటువైపుకైనా దారీ తీయోచ్చ‌ని హెచ్చ‌రించారు.