స‌మంత‌ని న‌వ్వుతోనే ప‌డ‌గొట్టేశాడా?

Wednesday, September 21st, 2016, 01:14:54 AM IST

dasari
నాగ‌చైత‌న్య న‌వ్వుకే స‌మంత ప‌డిపోయిందా? దాస‌రి నారాయ‌ణ‌రావు ప్రేమ‌మ్ ఆడియో వేడుక‌లో అదే విష‌యాన్నిచెప్పాడు మ‌రి. ఆ మాట ఆడియో ఫంక్ష‌న్‌కే హైలెట్ అని చెప్పొచ్చు. నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా న‌టించిన `ప్రేమ‌మ్` చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుక‌కి దాస‌రి నారాయ‌ణ‌రావు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నాగ‌చైత‌న్య గురించి మాట్లాడుతూ చైతూ న‌వ్వు బాగుంటుంది. ఆ న‌వ్వుతోనే ఓ హీరోయిన్‌ని ప‌డ‌గొట్టాడు అన్నాడు. ఆ మాట‌కి స‌భికులంతా న‌వ్వుకొన్నారు. ఆ హీరోయిన్ ఎవ‌రన్న‌ది దాస‌రి బ‌య‌ట‌కి చెప్పలేదు కానీ, ఆ మాట‌తో స‌మంత ఎందుకు నాగ‌చైత‌న్య‌కి ప‌డిపోయింద‌న్న ర‌హ‌స్యం మాత్రం బ‌య‌టికొచ్చిన‌ట్టైంది.