దాస‌రికి శిష్యుల‌ కానుక‌లు.. స్వ‌ర్గంలో ఆయ‌న‌కు షాకే!….ఫిలింఛాంబ‌ర్ ముందు దాస‌రి విగ్ర‌హం?

Sunday, April 29th, 2018, 10:22:07 PM IST

ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు మ‌ర‌ణానంత‌రం ప‌రిశ్ర‌మ పెద్ద దిక్కును కోల్పోయి మూగ‌వోయింది. 30 మే 2017న ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఆయ‌న మ‌ర‌ణించారు. అప్ప‌టినుంచి ఏదో కోల్పోయిన లోటు ప‌రిశ్ర‌మ‌కు తెలుస్తూనే ఉంది. దాస‌రి మ‌ర‌ణానంత‌రం ప‌రిశ్ర‌మ‌లో త‌లెత్తిన ఏ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం లేదు. మొన్న‌టి థియేట‌ర్ల బంద్ తేలిపోవ‌డానికి, నిన్న శ్రీ‌రెడ్డి వివాదం అంత ర‌చ్చ‌వ్వ‌డానికి దాస‌రి అనే పెద్ద నోరు లేక‌పోవ‌డ‌మే కార‌ణం.

అదంతా స‌రే.. ఆయన మ‌ర‌ణించి అప్పుడే ఏడాది అవుతోంది అంటే న‌మ్మ‌గ‌ల‌రా? 24 శాఖల కార్మికులు దేవుడిగా భావించే ఆయ‌న వెళ్లి సంవ‌త్స‌రం అయిపోతోంది. ఈలోగానే మే 4న తొలి జ‌యంతికి శిష్య‌బృందం స‌న్నాహ‌లు చేస్తోంది. అయితే ప‌రిశ్ర‌మ‌లో అన్ని శాఖ‌ల్లోనూ వంద‌లాదిగా ఉన్న దాస‌రి శిష్యులు గురువుగారికి ఆ రోజు ఎలాంటి కానుక‌లు ఇవ్వ‌బోతున్నారు? అంటే అందుకు స‌మాధానంగా రెండు అదిరిపోయే ఆన్స‌ర్స్ రెడీ. మే 4న దాస‌రి కాంస్య విగ్ర‌హాన్ని తెలుగు ఫిలింఛాంబ‌ర్ ముందు ఆవిష్క‌రించ‌నున్నారు. వేరొక‌టి దాస‌రి బ‌యోపిక్‌ని ఆరోజు అధికారికంగా లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయ‌ని తెలుస్తోంది. దాస‌రికి అత్యంత ఆప్తుడు, కుడిభుజం అయిన నిర్మాత సి.క‌ళ్యాణ్ గురువుగారిపై బ‌యోపిక్ తెర‌కెక్కించ‌నున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments