తల్లికి తలకొరివి పెట్టిన కూతురు

Saturday, December 31st, 2016, 11:49:20 AM IST

daughter
ఎలమంచిలి పట్టణంలో రామచంద్రమ్మ కాలనీలో ఉంటున్న పూడి పైడితల్లికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు. ఆమె భర్త పిల్లలు చిన్నతనంలోనే చనిపోయాడు. ఆమె కాయకష్టం చేసుకుంటూ పిల్లల్ని పోషించింది. ఆమె పెద్ద కుమార్తె అప్పల నర్స కు పెళ్లి అయిన తరువాత కొద్దీ కాలానికే భర్త చనిపోయాడు. ఆమె మెట్టినింటి నుండి పుట్టింటికి వచ్చేసింది. తమ్ముడు, చెల్లితో కలిసి తల్లి వద్దే ఉంటుంది. కొద్ది కాలానికే విధి వక్రించింది. ఆమె చెల్లి, తమ్ముడు ఇద్దరూ అనారోగ్యంతో చనిపోయారు.

25 సంవత్సరాలుగా ఆ తల్లి కూతుళ్లు కొండమీది పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. తల్లికి వయస్సు మీద పడడంతో అప్పల నర్సే కూలీ పనులు చేస్తూ తల్లిని పోషిస్తుంది. అయితే ఇప్పుడు శుక్రవారం తల్లి కూడా చనిపోవడంతో అప్పలనర్స దిక్కులేనిది అయ్యింది. ఓదార్చడానికి బంధువులు లేరు. కన్నీరు తుడవడానికి సన్నిహితులు కూడా లేరు. తల్లికి అంత్యక్రియలు చేయడానికి సరిపడా డబ్బు కూడా ఆమె దగ్గరలేదు. పరిస్థితి అర్ధమైన చుట్టుపక్కలవారు తాము ఉన్నామంటూ ముందుకొచ్చారు. వారి సాయంతో కన్నతల్లికి తలకొరివి పెట్టి మాతృమూర్తి రుణం తీర్చుకుంది ఆ కూతురు. అప్పలనర్స కు ఉన్న ఒక్క తోడును కూడా ఆ దేవుడు ఆమెకు దూరం చేసాడు. తలకొరివిపెట్టి ఒంటరిగా అక్కడనుండి వెళ్ళిపోయింది.

  •  
  •  
  •  
  •  

Comments