హైదరాబాద్ తోనే కేన్…స్పష్టం చేసిన వార్నర్

Sunday, November 15th, 2020, 12:43:59 PM IST

ఈ ఏడాది ఐపిఎల్ చాలా రసవత్తరం గా సాగింది. ఊహించని రీతిలో హైదరాబాద్ ప్లే కి చేరి మిగతా అన్ని జట్లకు షాక్ ఇచ్చింది. అయితే ఈ ఏడాది మూడో ప్లేస్ తో పరిమితం అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ లో కేన్ విలియం సన్ కీలక ప్రదర్శన కనబరిచారు. ఢిల్లీ తో జరిగిన డు ఆర్ డై మ్యాచ్ లో సైతం కేన్ విలియం సన్ అదరహో అనిపించిన సంగతి తెలిసిందే.

అయితే వచ్చే ఏడాది మరొక కొత్త టీమ్ తో ఐపియల్ మొదలు కానుంది. ఇంకో ఆరు నెలల్లో ఐపియల్ 14 ను ప్రారంభించనున్న విషయాన్ని సౌరవ్ గంగూలీ వెల్లడించారు. అయితే కేన్ విలియం సన్ వచ్చే ఏడాది హైదరాబాద్ తరపున ఆడతాడా లేదా అనే అనుమానం తో కొందరు నెటిజన్లు డైరెక్ట్ గా డేవిడ్ వార్నర్ ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా అడిగారు. అయితే ఇందుకు డేవిడ్ వార్నర్ స్పందించారు. విలియం సన్ ను జట్టు నుండి తీసివేయరు అని, తాను టీమ్ లో ఆడాలని నేను కూడా కోరుకుంటా అని అన్నారు. ఈ విషయం తో సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ముంబై ఇండియన్స్ అయిదో సారి టైటిల్ గెలుచుకున్న సంగతి అందరికీ తెలిసిందే.