అవి ఆత్మహత్యలు కావు.. హత్యలే!

Wednesday, October 15th, 2014, 03:49:39 PM IST

Errabelli-Dayakar-Rao
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై తెలుగుదేశం సీనియర్ నేత ఎర్రబిల్లి దయాకర్ రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ అసమర్ధతతో తెలంగాణ ప్రభుత్వం ప్రతీ రంగంలోను అన్ని విధాలుగా విఫలమైందని ధ్వజమెత్తారు. అలాగే గడచిన ఐదు నెలల పాలనలో కెసిఆర్ గాని, ఆయన ప్రభుత్వం గాని సాధించినది ఏమీ లేదని ఎర్రబిల్లి దుయ్యబట్టారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలం అవుతున్న కెసిఆర్ టిడిపి ఎమ్మెల్యేలను కొనడంలో సఫలత సాధిస్తున్నారని ఎద్దేవా చేశారు. అలాగే తన అసమర్ధతను కప్పి పుచ్చుకోవడానికే కెసిఆర్ ఎదురు దాడికి దిగుతున్నారని ఎర్రబిల్లి విమర్శించారు. ఇక ప్రజా సమస్యలపై అఖిలపక్షం ఏర్పాటు చెయ్యాలని ఎర్రబిల్లి డిమాండ్ చేశారు. అటుపై తెలంగాణలో ఇప్పటి వరకు 241మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అవి ఆత్మహత్యలు కావని కెసిఆర్ ప్రభుత్వం చేసిన హత్యలని ఎర్రబిల్లి దయాకర్ రావు తీవ్రంగా విమర్శించారు.