నాగార్జున పొలంలో మృతదేహం – పూర్తిగా కుళ్లిపోయిన స్థితి

Thursday, September 19th, 2019, 12:56:45 AM IST

ప్రముఖ హీరో నాగార్జున కి సంబందించిన పొలంలో ఒక మృతదేహం లభించింది. అదికూడా పూర్తి స్థాయిలో కుళ్ళిపోయింది. వివరాల్లోకి వెళ్తే… షాద్ నగర్ మండలం, కేశంపేట్ పరిధిలోని పాపిరెడ్డి గూడలో నాగార్జున కి సంబందించిన వ్యవసాయ పొలంలో ఒక కుళ్లిపోయిన స్థితిలో ఒక మృతదేహం లభ్యమైంది. చివరికి ఆ మృతదేహం ఒక ఎముకలగూడు లా మారిపోయిన స్థితిలో లభ్యమైంది. కాగా దీనిపైన పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈనెల 10 వ తేదీన తన వ్యవసాయ భూమికి తన భార్యతో కలిసి వెళ్లిన నాగార్జున అక్కడ తన భార్యతో కలిసి కొన్ని చెట్లను నాటాడు. కాగా ఈమేరకు అక్కడ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు నాగార్జున…

అందుకోసమనే నాగార్జున తన పొలానికి నిపుణులను పంపించాడు. అయితే అక్కడకు వెళ్లిన నిపుణులు ఒక గదిలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఒక మృతదేహాన్ని గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ మృతదేహం దొరికిన గదిని సీజ్ చేసి, దానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. దానితోపాటే ఆడేవారిది అయివుంటుందని ఆరా తీస్తున్నారు పోలీసులు. కాగా ఈ విషయంపై నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి మరి.