దారుణం : హెల్త్ వర్కర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఆటోడ్రైవర్…

Saturday, May 23rd, 2020, 10:48:08 AM IST

రోజురోజుకు మనుషుల మధ్యన మానవత్వాలు మంటగలుస్తున్నాయి. చిన్న చిన్న పొరపాట్లకే మనుషుల ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడటం లేదు కొందరు కర్కశ హృదయులు… కాగా తాజాగా ఇలాంటి ఘటన కేరళ లోని, ఎర్నాకులం జిల్లాలోని పచలంలో చోటుచేసుకుంది. కాగా గత కొంత కాలంగా స్థానికంగా నివాసముంటున్నటువంటి ఓ ఆటో డ్రైవర్ జరిపినటువంటి పెట్రోలు దాడిలో, తీవ్రంగా గాయపడినటువంటి ఒక హెల్త్ వర్కర్ ప్రాణాలు కోల్పోయాడు. కాగా ఘటనలో గాయపడినటువంటి బాధితుడు రిజిన్ దాస్(34) బాగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చికిత్స అందించిన వైద్యులు వెల్లడించారు.

ఈ ఈ ఘటనలో గాయపడిన పంగజాక్షన్ అనే మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించిన వైద్యులు, అతడి పరిస్థితికూడా విషమంగానే ఉండని తెలిపారు. కాగా పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిపినటువంటి దాడి కాదని, అకస్మాత్తుగానే జరిపిందని పోలీసులు వెల్లడించారు. ఇకపోతే నిందితుడు ఫిలిప్ మానసిక పరిస్థితి సరిగా లేక పోవడం వల్లే ఈ ఘటనకు ఒడిగట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.