ఢిల్లీలో దారుణం : అగ్నిప్రమాదంలో 32 మంది మృతి

Sunday, December 8th, 2019, 09:30:09 AM IST

మన దేశ రాజధాని ఢిల్లీలో ఘోరమైన అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో దాదాపుగా 32 మంది మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే… అనాజ్‌మండి ప్రాంతంలోని ప్లాస్టిక్ తయారీ ప్రాంతంలో అకస్మాత్తుగా జరిగినటువంటి ఈ అగ్నిప్రమాదంలో విపరీతమైన పొగ, మంటలతో ఊపిరాడక 32 మంది మరణించినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి భవనంలో ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేసినట్లు సమాచారం. అయితే అనుకోకుండా అక్కడి ప్లాస్టిక్ కి మంటలు అంటుకొని ఒక్కసారిగా ఆ భవనం అంతటా వ్యాపించాయి. అయితే ఈ ప్లాస్టిక్ తగలబడుతున్న సమయంలో వచ్చిన దుర్వాసనకే అనేకమంది ఊపిరి ఆడక మరణించినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో మరో 50 మందికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. కాగా విషయం తెలుసుకున్న 30 ఫైరింజన్లు ప్రస్తుతానికి మంటలను అదుపు చేశాయి. అయితే ఈ ఘటనలో మరింతగా ప్రాణ నష్టం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బాదితులందరిని స్థానిక లోక్ నాయక్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.