ఏపీలో మళ్లీ ‘దీపం’

Tuesday, September 16th, 2014, 06:47:52 PM IST


దశాబ్ద కాలం తర్వాత మళ్లీ దీపం కాంతులు వెదజల్లనున్నాయి. తెలుగుదేశంపార్టీమానస పుత్రిక అయిన దీపం పథకానికి పునర్ వైభవం రానుంది. ఈ పథకం అమలు చేసి.. మహిళల కంట్లో సంతోషాన్ని నింపాలని సర్కార్ భావిస్తోంది. ఈ ఏడాది ఈ పథకం కోసం టిడిపి సర్కారు బడ్జెట్ లో 80 కోట్ల రూపాయలు కేటాయించారు. ఐదు లక్షల కనెక్షన్లు గాను.. మూడు లక్షల కనెక్షన్లు ఇవ్వడనానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో కిరోసిన్ బంక్ లు ఏర్పాటుకు రంగం సిద్దమవుతోంది. ఈ బంక్ ల ఏర్పాటుకోసం ఇప్పటికే ఒక బృందం తమిళనాడు వెళ్లి పరిశీలించి వచ్చింది. పెట్రోల్ బంక్స్ మారిగా రాష్ట్రంలోకిరోసన్ బంక్స్ ఏర్పాటు కానున్నాయి.. దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలోనే ఖారారు కానున్నాయి…

ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రకటించిన అన్న క్యాంటీన్ల ఏర్పాట్లు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.ముందుగా ప్రచారం జరిగినట్లు ఆక్టోబర్ 2 నుంచి కాకుండా.. సుమారు ఒక నెల ఆలస్యంగా రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు అవుతాయని మంత్రి పరిటాల సునీత చెప్పారు. కొంచెం ఆలస్యం అయినా.. ఈ పథకాన్ని బాగా అమలు చేసితీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో సుమారు 15 నుంచి 18 లక్షల బోగస్ కార్డులు ఉన్నాయని మంత్రి సునీత చెప్పారు బోగస్ కార్డుల వలన పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతుందని అన్నారు.బోగస్ కార్డులు ఏరివేత కోసమే ఆధార్ ని అనుసంధానం చేస్తామని చెప్పారు.

అమ్మ హస్తం పథకం పేరు త్వరలోనే మారనుంది.. ఈ పథకం మంచిదైనా అచరణలో మాత్రం గతపాలకుల నిర్లక్ష్యం వలను నీరుకారిందని మంత్రి సునీత ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మహస్తం.. కాంగ్రెస్ హస్తంగా మరిందని అభివర్ణించారు. ఈ పథకాన్ని పూర్తిగా పునఃసమీక్షించి.. పేరు, వస్తువుల నాణ్యత, సంఖ్య ను పెంచుతామని అన్నారు. రైతు బజార్లలో పలు సంస్కరణలను తెచ్చి.. దళారుల వ్యవస్థను లేకుండా చేసి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు.