మళ్లీ అలాంటి సినిమాలను చేయను : దీపిక పదుకొనె

Tuesday, January 30th, 2018, 12:31:41 PM IST

సినిమా మొదలైనప్పటి నుంచి ఊహించని విధంగా వివాదాలను ఎదుర్కొన్న పద్మావత్ సినిమా ఎట్టకేలకు విడుదలై మంచి కలెక్షన్స్ ని అందుకుంటోంది. కొన్ని రాష్ట్రాల్లో సినిమా ప్రదర్శనను నిలిపివేసినప్పటికీ సినిమాకి పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. సినిమా చూసిన వారు చాలా పాజిటివ్ కామెంట్స్ చేస్తుండడం హైలెట్ గా నిలుస్తోంది. ఇకపోతే సినిమా తెరకెక్కించడం పై గత కొంత కాలంగా కొన్ని హిందూ సంఘాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా దీపిక పదుకొనె పై దాడి చేయాలంటూ ఎన్నో వార్నింగ్ లు వచ్చాయి. అయితే ఏనాడూ దీపికా ఆ విషయాలపై వివరణ ఇవ్వలేదు. కానీ రీసెంట్ గా ఆమె అలాంటి సినిమాల్లో మరోసారి నటించను అని గట్టిగా చెప్పేసిందని సన్నిహితులు చెబుతున్నారు. ఆ సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉందని కాకపోతే ఈ స్థాయిలో వివాదాలు చెలరేగుతాయని తాను గ్రహించలేదని దీపికా బాదపడిందట. చారిత్రాత్మక సినిమాల్లో నటించే అవకాశం వస్తే దాదాపు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాను అని దీపికా నిర్ణయం తీసుకుందని తెలియగానే బాలీవుడ్ లో ఆ వార్త వైరల్ గా మారింది.