జెన్నిఫ‌ర్ లోపెజ్ స్కెచ్ గీసిన‌ట్టుగా…….

Friday, September 7th, 2018, 06:47:12 PM IST

జెన్నిఫ‌ర్ లోపెజ్ స్కెచ్ గీసిన‌ట్టుగా ఉందిరో ఈ సుందరి ..
బ్రిట్నీ స్పియ‌ర్స్‌ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ కాడ్బరి..
ఆ నడుమే చూస్తే ష‌కీరా.. దాన్ని అంటుకున్న చెయ్యే లక్కీరా …
ఆ నడకే చూస్తే బియాన్స్‌ బేబి నవ్విందంటే ఖల్లాసే …
జెన్నిఫ‌ర్ లోపెజ్ స్కెచ్ గీసిన‌ట్టుగా ఉందిరో ఈ సుందరి ..
బ్రిట్నీ స్పియ‌ర్స్‌ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ కాడ్బరి..

ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ సినిమా జ‌ల్సాలోని పాట ఇది. ఈ పాట‌లో నాయిక‌ల‌ అంద‌చందాల్ని వ‌ర్ణిస్తూ లిరిసిస్టులు గొప్పగా ఆక‌ట్టుకున్నారు. రాక్‌స్టార్ దేవీశ్రీ మ్యూజిక్ హైలైట్. ప్ర‌స్తుత సంద‌ర్భంలో దీపిక ప‌దుకొనే లుక్ చూశాక ఆ పాట స్ఫుర‌ణ‌కు రావాల్సిందే. క్రీగంటి చూపుల‌తో సూటిగా దూసుకుపోతోంది ఈ అమ్మ‌డు. ఓ వైపు ఇంట్లోవాళ్లు పెళ్లి ప‌నుల్లో బిజీ. దీపిక‌.. ర‌ణ‌వీర్‌ని పెళ్లాడేందుకు రెడీ అవుతోంది. న‌వంబ‌ర్‌లోనే పెళ్లి.. అస‌లు టైమ్ లేనే లేదు. ఈలోగానే ఇదిగో ప్ర‌ఖ్యాత ఎల్లే మ్యాగ‌జైన్ క‌వ‌ర్‌పేజీ షూట్‌లో పాల్గొంది. బ్లాక్ మిరుమిట్ల డిజైన‌ర్‌వేర్‌లో క్యాట్ ఉమెన్‌లా ఫోజులిచ్చింది. ఆ కాటుక క‌ళ్ల‌తో తీక్ష‌ణ‌మైన చూపుల‌తో కుర్ర‌కారు గుండెల్ని చిదిమేసిందిలా. అంత‌కుమించి ఎద అందాల్ని హాలీవుడ్ స్టార‌ల‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో ఎలివేట్ చేసి మ‌త్తెక్కించింది.

  •  
  •  
  •  
  •  

Comments