ఎన్టీఆర్ బయోపిక్ లో దీపికా ?

Thursday, April 5th, 2018, 10:41:57 AM IST

ఎన్టీ రామారావు జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమా విషయంలో క్రేజీ తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి . తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే హైదరాబాద్ లో భారీగా పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటిస్తుండగా, రాజశేఖర్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్య బసవ తారకం పాత్రకోసం బాలీవుడ్ హీరోయిన్స్ ను తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విద్య బాలన్ నటిస్తుందంటూ వార్తలు వచ్చాయి .. కానీ విద్యా బాలన్ తో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు, ఈ లోగా మరో బాలీవుడ్ క్రేజీ భామ పేరు వినిపిస్తుంది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ క్రేజీ గర్ల్ దీపికా పదుకోన్? దీపికా అయితే ప్రాజెక్ట్ కు కూడా మంచి హైప్ వస్తుందన్న నేపథ్యంలో త్వరలోనే ఆమెను సంప్రదించాలని భావిస్తున్నారు. మరి ఈ సినిమాలో దీపికా నటిస్తుందా లేదా అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దసరాకు విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments