దీపిక సీక్రెట్‌గా పెళ్లి షాపింగ్

Saturday, March 24th, 2018, 10:28:38 PM IST

అనుష్క శ‌ర్మ‌- విరాట్ కోహ్లీ సీక్రెట్‌ వివాహం త‌రవాత‌.. శ్రీయ – ఆండ్రీ కోస్చీవ్ వివాహం అంతే ర‌హ‌స్యంగా జ‌రిగింది. అటుపై సోన‌మ్‌ – అహూజా , ఎమీజాక్స‌న్ – జార్జ్‌, శ్రుతిహాస‌న్ – మైకేల్ కోర్స‌లే .. ఇన్ని పెళ్లిళ్లు క్యూలో ఉన్నాయి. వీళ్ల‌తో పాటు దీపిక ప‌దుకొన్‌- ర‌ణ‌వీర్ సింగ్ వివాహానికి సంబంధించిన వేడెక్కించే అప్‌డేట్స్ అందుతున్నాయి. దీపిక‌- ర‌ణ‌వీర్ కుటుంబాలు ఇప్ప‌టికే ముంబై లో క‌లుసుకుని పెళ్లి మాట‌లు మాట్లాడుకున్నార‌న్న ప్ర‌చారం సాగింది.

తాజాగా ఈ పెళ్లిలో మ‌రో ముంద‌డుగు! ఈసారి పెళ్లి వెన్యూ నిర్ణ‌యించే ఏర్పాట్ల‌లో ఉన్నార‌న్న స‌మాచారం అందింది. అంతేకాదు దీపిక త‌న త‌ల్లిగారైన ఉజ్వ‌ల ప‌దుకొనె, సోద‌రి అనీషా ప‌దుకొనేతో క‌లిసి బెంగ‌ళూరులో పెళ్లి షాపింగుకి వెళ్లింద‌ని తెలుస్తోంది. దీపిక గ‌త కొంత‌కాలంగా వెన్ను నొప్పితో బాధ‌ప‌డుతోంది. ఆ క్ర‌మంలోనే కుటుంబ స‌భ్యుల‌తో బెంగ‌ళూరులోనే ఉంటోంది. లేటెస్టుగా షాపింగులు పూర్తి చేసింద‌ని తెలుస్తోంది. పెళ్లి వ‌స్త్రాలు, జువెల‌రీ షాపింగ్ పూర్త‌యింద‌ని చెబుతున్నారు. ఇక‌పోతే `సాప్నా దీదీ` బ‌యోపిక్‌లో న‌టించేందుకు సిద్ధ‌మైన దీపిక వెన్ను నొప్పి వేదించ‌డంతో విశ్రాంతి తీసుకుంటోంది. ర‌ణ‌వీర్ మాత్రం `సింబా` షూటింగుకి రెడీ అవుతున్నాడు. ఈ గ్యాప్‌లోనే ఈ జంట‌కు వివాహం జ‌రిగే ఛాన్సుంద‌న్న ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేం. విరుష్క త‌ర‌హాలోనే ఈ పెళ్లి కూడా సీక్రెట్‌గానే జ‌రుగుతుందా? అన్న‌ది వేచి చూడాలి.