స్టార్ హీరోలనే తొక్కేస్తున్న దీపిక..పారితోషకం ఎంతో తెలుసా..?

Tuesday, January 31st, 2017, 04:56:57 PM IST

deepika
ప్రస్తుతం బాలీవుడ్ లో దీపికా హవా మామూలుగా లేదు. బాలీవుడ్ లోనే కాదు ఈ అమ్మడు హాలీవుడ్ లో కూడా అడుగు పెట్టి దుమ్ము రేపుతోంది.మామూలుగానే రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపించే దీపికా.. హాలీవుడ్ లో అడుగుపెట్టి వస్తే ఊరుకుంటుందా. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వివాదంగా మారిన ‘పద్మావతి’ చిత్రంలో దీపిక టైటిల్ రోల్ ప్లే చేస్తోంది.ఈ చిత్రం భారీస్థాయిలో తెరకెక్కుతుండగా.. దీపికా అదే స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. ఈ చిత్రంలో రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ లు హీరోలుగా నటిస్తున్నారు. దీపికా వీరికంటే కూడా ఎక్కు వ పారితోషకాన్ని డిమాండ్ చేస్తోందట.

సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా రూ 12 కోట్ల పారితోషకాన్ని అందుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ విలువ బాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోల రెమ్యునరేషన్ కంటే ఎక్కువ కావడం విశేషం.ఇప్పటికే బాలీవుడ్ లో దీపికా నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతోంది.స్టార్ హీరోలను సైతం దాటిపోతుండడంతో దీపికా హవా మామూలుగా లేదని చర్చించుకుంటున్నారు.