వైరల్ పిక్ : మరీ ఇలాంటి బట్టలేసుకోవద్దమ్మా దీపికా..!

Friday, October 20th, 2017, 09:16:08 AM IST

కుర్రాళ్ల స్వప్న సుందరి, బాలీవడ్ తార దీపికా పదుకునే ఎలాంటి డ్రెస్ లో అయినా అందాలు ఆరబోస్తే చాలా యువతకు కునుకు ఉండదు. ఆమె ఏ డ్రెస్ వేసినా అపురూప సుందరిగా దర్శనం ఇస్తుంది. కానీ దీపిక డ్రెస్సింగ్ విషయంలో ఇప్పుడు ఏళ్ల వేళలా అలా జరగడం లేదు. దీపిక తాను ధరిస్తున్న దుస్తుల కారణంగా విమర్శలను ఎదుర్కొంటోంది. ఇటీవల ఆమె ముంబైలో జరిగిన జియో మామి ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమానికి హాజరైంది. కాళ్ల నుంచి మీద వరకు ఆకుపచ్చ వర్ణం గల దుస్తుల్ని దీపిక ధరించింది. దీపికా ధరించిన ఈ దుస్తులు ఏమాత్రం బాలేవు సరికదా.. ఆమె అందవికారంగా కనిపిస్తోందని ఆమె అభిమానులే గగ్గోలు పెడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

దీపికా వెంటనే తన స్టైలిస్ట్ ని మార్చుకోవాల్సిందిగా అభిమానులు సలహా ఇస్తున్నారు. దీపికా తన వస్త్ర ధారణ విషయంలో గతంలో కూడా పలు మార్లు విమర్శలని ఎదుర్కొంది. జియో మామి ఫిలిం ఫెస్టివల్ ముగింపు వేడుకలో దీపిక ఇలా దర్శనమిచ్చింది.

  •  
  •  
  •  
  •  

Comments