దీపిక నెక్‌పై ర‌ణ‌బీర్ టాట్టూ ప్ర‌కంప‌నం

Wednesday, May 2nd, 2018, 08:19:08 PM IST


దీపిక ప‌దుకొన్ సంచ‌ల‌నాల గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నే లేదు. ఈ భామ టైటిల్ పాత్ర పోషించిన `ప‌ద్మావ‌త్‌` ప్ర‌పంచ‌వ్యాప్తంగా గొప్ప విజ‌యం అందుకుంది. ఆ క్ర‌మంలోనే వ‌ర‌ల్డ్‌వైడ్‌ వీరాభిమానుల్ని పెంచుకున్న దీపిక .. ఇప్ప‌టికిప్పుడు హాలీవుడ్‌ని కూడా ఏలేసేంత స్థాయిని అందుకుంది. అయితే దీపిక మాత్రం హాలీవుడ్‌లో అడ‌పాద‌డ‌పా మాత్ర‌మే న‌టిస్తూ .. ఈ ఏడాది తన బోయ్‌ఫ్రెండ్ ర‌ణ‌వీర్ సింగ్‌ని పెళ్లాడేందుకు రెడీ అవుతోంది.

అదంతా స‌రే.. ఇలాంటి వేళ దీపిక మొండి వ్య‌వ‌హారం గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. డిప్స్‌ త‌న‌ని పెళ్లాడ‌బోయే ర‌ణ‌వీర్‌సింగ్‌ టాట్టూ త‌న శ‌రీరాన్ని అలంక‌రించాలి కానీ, మాజీ ప్రియుడు ర‌ణ‌బీర్ టాట్టూ త‌న దేహంపై క‌నిపిస్తోందేంటి? అంటూ ప్ర‌పంచం విస్తుపోతోంది. దీపిక ఎందుకిలా చేస్తోంది? కావాల‌నే చేస్తోందా? ఆ టాట్టూని తొల‌గించుకోవ‌చ్చు క‌దా! అంటూ ప్ర‌శ్నిస్తున్నారు జ‌నం. అయితే దీపిక మాత్రం అందుకు స‌సేమిరా అంటోంది. ప్ర‌స్తుతం న్యూయార్క్‌లో ఉన్న దీపిక అక్క‌డ ఓ జిమ్‌లో నిరంత‌రం ఫిట్‌నెస్ కోసం ప్ర‌త్యేక క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఆ క్ర‌మంలోనే దీపిక వ‌ర్క‌వుట్ల ఫోటోల్ని జిమ్ కోచ్ సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లో దీపిక మెడ‌పై ఇంకా ఆర్‌.కె (ర‌ణ‌బీర్ క‌పూర్‌) అన్న టాట్టూ హైలైట్‌గా క‌నిపిస్తోంది. క‌నీసం పెళ్లి చేసుకునే వేళ అయినా దీపిక ఆ టాట్టూని హ‌రాష్ చేయ‌దంటారా? అంటూ ఒక‌టే మీడియాలో హోరెత్తిపోతోంది.