ఆ హీరోతో .. పిల్లలను కన్నానంటున్న దీపికా ?

Thursday, January 19th, 2017, 03:50:02 PM IST

deepika
బాలీవుడ్ లో గ్లామర్ భామ దీపికా పదుకోన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అయినా ఈ అమ్మడు అలాంటి కామెంట్స్ చెప్పడం సంచలనం రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళితే .. బాలీవుడ్ భామ దీపికా ”ట్రిపుల్ ఎక్స్” సినిమాతో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. హాలీవుడ్ హీరో విన్ డీజిల్ తో కలిసి నటించిన ఈ అమ్మడు ఓ షో లో పాల్గొంది .. అక్కడ తనకు విన్ డీజిల్ మీద చాలా క్రష్ (కోరిక ) ఉందని, అతని ద్వారా పిల్లలను కన్నాను అంటూ సంచలనం రేపింది ? క్రష్ సంగతి ఓకే కానీ దీపికా ఎప్పుడు పిల్లలని కన్నది అన్నదే ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తుంది. అయితే ఆమె పిల్లలను కన్నది నిజంగా కాదట .. కలలో అని చెప్పింది ? మొత్తానికి విన్ డీజిల్ తో నటించడం వల్ల ఈ అమ్మడు అతనికి పడిపోయిందని, పైగా అతనితో కెమిస్ట్రీ బాగా కుదిరినట్టుంది. కొంపదీసి అతడితో డేటింగ్ గట్రా చేస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న?