ద్రౌపది పాత్రలో దీపికా పదుకొనే

Thursday, April 26th, 2018, 07:15:33 PM IST

బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ కీలక పాత్రలో ‘మహాభారత’ మూవీకి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబాసీ ఈ మూవీని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కునున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నది. మహాభారత లో ద్రౌపది పాత్రకు దీపికా పదుకొనేను తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట అమీర్.

బాజీరావ్ మస్తానీ, రామ్‌లీలా, పద్మావత్ వంటి హిస్టారికల్ మూవీస్‌లో అద్భుతమైన నటనతో అందరినీ కట్టిపడేసిన దీపికా..ద్రౌపది పాత్రకు సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నాడట అమీర్‌ఖాన్. ఈ పాత్ర కోసం దీపికాను ఎలాగైనా ఒప్పించాలని అమీర్‌ డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో అందరూ స్టార్ యాక్టర్లనే తీసుకోవాలనే యోచనలో ఉన్నాడు అమీర్.

  •  
  •  
  •  
  •  

Comments