పద్మావత్ బ్యూటీ పెళ్లంటా..రణ్ వీర్ రెడీ?

Tuesday, March 6th, 2018, 04:30:30 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె పెళ్లి గురించి ప్రస్తుతంబాలీవుడ్ లో ఓ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. మరో మూడు నెలల్లో ఆమె పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా దీపిక రన్ వీర్ సింగ్ తో ప్రేమను కొనసాగిస్తోన్న సంగతి అందరికి తెలిసిందే. షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ జంట వారానికోసారైనా కలుసుకోకుండా ఉండలేరు. పార్టీలకు నైట్ అవుట్ లాంగ్ డ్రైవ్ లకు వెళుతూనే ఉంటారు. ఇక అసలు విషయానికి వస్తే.. దీపిక రణ్ వీర్ ఫ్యామిలీ పెద్దల మధ్య రీసెంట్ గా చర్చలు జరిగాయని తెలుస్తోంది.

దాదాపు ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోవడంతో పెళ్లికి ముహుర్తాలను సెట్ చేస్తున్నట్లు సమాచారం అన్ని అనుకున్నట్టుగా జరిగితే.. ముంబైలోని తాజ్‌ ల్యాండ్స్‌ ఎండ్‌ లేదా ఫోర్‌ సీజన్స్‌ హోటల్స్ లో వివాహం జరిగే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఇద్దరికి కూడా మరో మూడు నెలల్లో కొంచెం గ్యాప్ దొరుకుతుండడంతో అప్పుడే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్లు టాక్. ప్రస్తుతం దీపిక షారుక్ ఖాన్ తో జీరో అనే సినిమాలో నటిస్తోంది. ఇక రణ్ వీర్ సింగ్ జోయా అక్తర్ దర్శకత్వంలో గల్లీ బాయ్ అనే సినిమా చేస్తున్నాడు.