కేన్స్ లో అదరగొట్టిన బాలీవుడ్ బ్యూటీ!

Friday, May 11th, 2018, 11:32:50 AM IST

బాలీవుడ్ లో ఎన్నో సినిమాతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ దీపికా పదుకొనె. ఎలాంటి సినిమాల్లో అయినా తన పాత్రతో మెప్పించే ఈ బ్యూటీకి ఈ మధ్య ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. పద్మావత్ సినిమా సృష్టించిన బాక్స్ ఆఫీస్ రికార్డులు అమ్మడి హోదాని చాలా పెంచాయి. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో మ్యాగజైన్ లకు పోజులివ్వడం అందరిని ఎక్కువగా ఆకట్టుకుంది. ఇకపోతే రీసెంట్ గా జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా దీపికా అందరిని ఆకర్షించేలా రెడీ అయ్యి వచ్చింది. ఆమె సరికొత్త డ్రెస్ హాలీవుడ్ ప్రముఖులను కూడా ఎంతగానో ఆకర్షించింది. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

#Cannes2018

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

  •  
  •  
  •  
  •  

Comments