ఆ హీరో మోసం చేశాడు, అందుకే వదిలేశా.. షాకిచ్చిన స్టార్ హీరోయిన్!

Wednesday, July 25th, 2018, 04:56:57 PM IST

బాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోల్లో యంగ్ హీరో రణబీర్ కపూర్ కు మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ముఖ్యంగా అమ్మాయిలైతే మనోడికి ఫిదా అవుతారు. ఇక హీరోయిన్స్ తో లవ్ రూమర్స్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లో ప్లేబోయ్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ హీరో సోనమ్ కపూర్, దీపికా పదుకునే, కత్రినా కైఫ్ వంటి భామలతో లవ్ నడిపినట్లు గతంలో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. కొన్ని సార్లు కనిపించాయి కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.

అసలు మ్యాటర్ లోకి వస్తే అతని లవ్ గురించి స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఊహించని విధంగా ఆన్సర్ ఇచ్చింది. 2007లో రణ్ బీర్ తో ప్రేమ వ్యవహారాన్ని నడిపిన దీపిక కొంత కాలం తరువాత విడిపోయింది. అయితే అలా ఆమె బ్రేకప్ చెప్పేయడానికి గల కారణాన్ని ఆమె ఇటీవల వివరించింది. ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు నేను ఎవరిని మోసం చేయలేదు. చేయను కూడా. అయితే రణ్ బీర్ తనను మోసం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడని మరో ఆవకాశం ఇవ్వాలని ప్రాదేయడినట్లు కూడా చెప్పింది. అయితే మరోసారో ఫూల్ అయ్యే ఉద్దేషం తనకు లేదనే కారణం చేత విడిపోయినట్లు తెలిపిన దీపిక ఆ తరువాత ఎంతో మానసిక వేదనకు లోనయినట్లు తెలిపింది. కొంత కాలం తరువాత నెమ్మదిగా బాధను మరచి కెరీర్ పై ద్రుష్టి పెట్టినట్లు ఈ స్టార్ హీరోయిన్ తడబడకుండా వివరణ ఇచ్చింది.

  •  
  •  
  •  
  •  

Comments